పూరి జగన్నాథ్, యంగ్ హీరో రామ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈసినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో చూశాం. వరుస ఫ్లాప్స్ తో ఉన్న పూరీకి అలానే రామ్ కు కూడా ఈసినిమా మంచి కమ్ బ్యాక్ ఇచ్చింది. ముఖ్యంగా ఈసినిమాలో రామ్ మాస్ నటన, యాస, యాటిట్యూడ్, మణిశర్మ మ్యూజిక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. పూరి మార్క్ డైలాగ్స్ ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించాయి. ఇప్పుడు సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ వస్తుంది. దీనిపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా టీజర్ ను ఈరోజు రామ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన నేపథ్యంలో రామ్ ఫ్యాన్స్ తో పాటు మాస్ ఆడియన్స్ కూడా టీజర్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ టైమ్ రానే వచ్చేసింది. డబుల్ ఇస్మార్ట్ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక టీజర్ అయితే అదిరిపోయింది అని చెప్పొచ్చు. ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబల్ ఇస్మార్ట్ అంటూ రామ్ మాస్ ఎంట్రీ ఇవ్వడంతో మొదలైన టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. సంజయ్ దత్ ను పవర్ ఫుల్ విలన్ గా చూపించారు. మొత్తానికి టీజర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది.
Let’s 𝑺𝒕𝒆𝒑𝒑𝒂 𝑴𝒂𝒂𝒓🕺💃
Igniting the double dose of action, entertainment, and mass elation 😎⚡️
Presenting ‘Ustaad’ #RAmPOthineni in #PuriJagannadh‘s #DoubleISMART 💥
Kirikirikirikirikiri 𝗱𝗶𝗠𝗔𝗔𝗞𝗜𝗞𝗜𝗥𝗜𝗞𝗜𝗥𝗜 #DoubleISMARTTeaser out now🔥
— Puri Connects (@PuriConnects) May 15, 2024
కాగా ఈసినిమాలో ఇంకా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను పూరి కనెక్ట్స్ పై పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మించనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. రిలీజ్ డేట్ పై త్వరలో క్లారిటీ ఇవ్వనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























