ఎన్టీఆర్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర. ఈసినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో వస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఏప్రిల్ 5న ఈసినిమాను రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ ఆ తరువాత రిలీజ్ డేట్ ను మార్చారు. అక్టోబర్ 10 వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ శరవేగంగా ముగించుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా ఫస్ట్ సింగిల్ పై ఇప్పటికే పలు వార్తలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ఫస్ట్ సింగిల్ ఆన్ ద వే అంటూ చిత్రయూనిట్ తమ చిత్రనిర్మాణ సంస్థ ద్వారా కన్ఫామ్ చేసింది. అయితే ఇప్పుడు ఫస్ట్ సింగిల్ పై మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. మే20 ఎన్టీఆర్ పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే కదా. ఆరోజే ఫస్ట్ సింగిల్ రానున్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వెయిట్ చేయాల్సిందే.
కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























