విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదల మరో సారి వాయిదా పడింది. ఈనెల 17న ఈసినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనుకున్నారు కానీ ఇప్పుడు ఆ డేట్ మారింది. ఈనెల 31న విడుదలచేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.ఇక అదే రోజు మరో 5సినిమాల వరకు విడుదలవుతున్నాయి అయితే హైప్ వున్న సినిమాకావడం తో గ్యాంగ్స్ అఫ్ గోదావరికి పెద్దగా నష్టం ఏం జరుగుకపోవచ్చు.ఇక ఇంతకుముందు ఇదే డేట్ కు విశ్వక్ సేన్ నటించిన ఫలక్ నమా దాస్ రిలీజ్ అవ్వగా ఆ సినిమా హిట్ అయ్యింది.మరి ఈ సారి కూడా ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందో చూడాలి.
ఇక ఇప్పటివరకు గాంగ్స్ ఆఫ్ గోదావరి నుండి విడుదలచేసిన రెండు పాటలు చార్ట్ బాస్టర్ కాగా రేపు మూడో సాంగ్ బ్యాడ్ విడుదలకానుంది.రీసెంట్ గా విడుదలచేసిన టీజర్ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రూరల్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా కృష్ణ చైతన్య తెరకెక్కిస్తున్న ఈసినిమాలో విశ్వక్ ఊర మాస్ రోల్ లో కనిపించనున్నాడు. ఇందులో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి కీలక పాత్రలో కనిపించనుంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.నాగవంశీ ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























