హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సినీ ప్రయాణంలో ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఇప్పుడైతే కొన్ని సెలక్టివ్ సినిమాల్లో మాత్రమే నటిస్తున్నారు. ఆ మధ్య రంగమార్తండ సినిమాలో సీరియస్ పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. అయితే ఈసారి సొంత తనయుడితో రావడం విశేషం. బ్రహ్మనందం, కొడుకు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో ఈసినిమా వస్తుంది. బ్రహ్మనందం అనే టైటిల్ తోనే ఈసినిమా రాబోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే తాజాగా ఈసినిమా నుండి ఒక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా ప్రీలుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ప్రీ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. గ్రామీణ, పట్టణ సంస్కృతుల సమ్మేళనంతో అలరిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ వీడియో సినీ అభిమానులు కడుపుబ్బా నవ్విస్తోంది. ఇందులో గౌతమ్ నెక్ట్స్ మూవీ గురించి బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ మధ్య జరిగిన సంభాషణను నవ్వుతెప్పిస్తుంది. ఎన్ని కథలు చెప్పినా ఒప్పుకోవడంలేదని బ్రహ్మీ గౌతమ్ గురించి చెబుతుంటే దానికి వెన్నెల కిషోర్ గౌతమ్ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడని అంటాడు.అయితే, ఈ సినిమాలో ఓ తాత క్యారెక్టర్ ఉందని, డైలాగులు కూడా ఉన్నాయని దాని కోసం… అనగానే, బ్రహ్మీ ఎవరికి ఫోన్ చేయాలో చెప్పండి, చేసి ఒప్పిస్తాను అంటాడు. మీరే చేయాలి అని చెప్పడంతో ఆయన షాక్ అవుతాడు. వీడియోను బట్టి ఈ సినిమాలో బ్రహ్మీ-గౌతమ్ తాత మనువళ్లుగా కనిపించనున్నారు.
Most awaited Announcement of our Production#4 titled “BrahmaAnandam”.
“FATHER-SON” DUO – ❌
“GRANDFATHER – GRANDSON” DUO – ✅Laughter is the only medicine when FATHER-SON duo turn into GRANDFATHER-GRANDSON for a HILARIOUS ENTERTAINER 🤩https://t.co/erRZxIvFYe@Swadharm_Ent… pic.twitter.com/DxQNNqeU54
— Swadharm Entertainment (@Swadharm_Ent) May 8, 2024
కాగా ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో ప్రియ వడ్లమాని, ఐశ్వర్య హీరోయిన్లుగా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. శాండిల్య పిసపాటి సంగీతం అందిస్తుండగా.. మితేష్ పర్వతనేని సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు. ప్రసన్న ఈసినిమాకు ఎడిటర్. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. సావిత్రి, శ్రీ ఉమేష్ యాదవ్ సమర్పిస్తున్నారు. అంతేాకాదు ఈఏడాది డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు కూడా ప్రకటించారు..
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























