కల్కి 2898AD ఈస్ట్ గోదావరి రిలీజ్ హక్కుల అప్ డేట్

kalki 2898 ad movie east godavari release rights update

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో రూపొందుతున్న మైథాలజీ ఇన్స్పైర్డ్ ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ ‘కల్కి 2898 AD’. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ 2023 శాన్ డియాగో కామిక్-కాన్‌లో లాంచ్ చేశారు. ఫస్ట్ గ్లింప్స్ కి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభించింది. దాని తరువాత పలు గ్లింప్స్, వీడియోలు రిలీజ్ చేయగా వాటికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా నుండి వరుస అప్ డేట్లు ఇస్తూ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నారు. ఈసినిమా నైజాం హక్కులకు సంబంధించిన అప్ డేట్ ను ఇప్పటికే ఇచ్చారు మేకర్స్. ప్రముఖ సంస్థ అయిన సినిమాస్ గ్లోబర్ వారు నైజాం హక్కులను సొంతంచేసుకున్నారు. ఇప్పుడు తాజాగా మరో ఏరియా హక్కులకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమా ఈస్ట్ గోదావరి రిలీజ్ హక్కులను వెంకట పద్మావతి ఫిలింస్ వారు దక్కించుకున్నట్టు తెలిపారు. ఈమేరకు తమకు ఈ హక్కులను ఇచ్చినందుకు డిస్ట్రిబ్యూషన్ సంస్థ తమ ట్విట్టర్ ద్వారా నాగ్ అశ్విన్ కు అలానే అశ్విని దత్ కు కృతజ్ఞతలు తెలియచేశారు.

కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుంది. మరొక హీరోయిన్ బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ మరో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తోట రమణి ఆర్ట్‌ డైరెక్టర్‌ గా వర్క్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.