కల్కి 2898ఏడీ టీమ్ సర్ ప్రైజ్ ప్లాన్

surprise update will come from prabhas kalki 2898 ad movie

ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కల్కి 2898ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా వస్తుంది. ఇక ఈసినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన గ్లింప్స్, స్పెషల్ వీడియోస్ అన్నీ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. మరోవైపు మే నెలలో ఈసినిమాను రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల ఈసినిమాను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. జూన్ 27వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా నుండి అప్ డేట్లను ఇస్తూ సినిమాపై ఇంకా బజ్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈసినిమా నుండి మర అప్ డేట్ తో వచ్చారు. డార్లింగ్స్ మీకో చిన్న సర్ ప్రైజ్.. వేచి ఉండండి అంటూ చిత్ర నిర్మాణ సంస్థ తమ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. మరి ఆ సర్ ప్రైజ్ ఏమై ఉంటుందబ్బా అంటూ ఫ్యాన్స్ ఇప్పటినుండే ఆలోచనలు చేస్తున్నారు.

కాగా ఈసినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో మరొక హీరోయిన్ బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ కూడా నటిస్తుంది. కమల్ హాసన్ మరో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తోట రమణి ఆర్ట్‌ డైరెక్టర్‌ గా వర్క్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.