బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న స్టార్ హీరోయిన్ సంయుక్త మీనన్

actress samyuktha menon bollywood entry

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం అంత ఈజీ కాదు.. ఎంట్రీ ఇచ్చినా తక్కువ కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకోవడం కాదు అంత ఈజీ కాదు. కానీ ఏదో చిన్న పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చి లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది సంయుక్త మీనన్. ఇండస్ట్రీలో అడుగుపెట్టి భీమ్లానాయక్, బింబిసార, సార్, విరూపాక్ష, డెవిల్..ఇలా వరుసగా ఐదు సూపర్ హిట్ సినిమాలతో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం సంయుక్త మీనన్ నిఖిల్ హీరోగా వస్తున్న స్వయంభూ సినిమాలో నటిస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. దీనితో పాటు సంయుక్త శర్వానంద్ కొత్త చిత్రంలోనూ హీరోయిన్ గా నటిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. త్వరలోనే సంయుక్త మీనన్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. తెలుగులో సంయుక్త తెచ్చుకున్న క్రేజ్ తో బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తుంది. హిందీలో ఓ ఇంట్రెస్టింగ్ బిగ్ ప్రాజెక్ట్ లో ఆఫర్ దక్కించుకున్నట్టు సమాచారం. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ గురించిన చర్చల కోసం సంయుక్తం ముంబై వెళ్లిందట. ఈనేపథ్యంలో ఎయిర్ పోర్ట్ లో వెళ్తున్న సంయుక్త ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే సంయుక్త తన బాలీవుడ్ మూవీని అనౌన్స్ చేయనుందని అంటున్నారు. చూద్దాం మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్ది రోజుల వెయిట్ చేయాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.