బిగ్ బాస్ 7.. హోస్ లో ప్రస్తుతం ఓటు అప్పీల్ కోసం పోటీ జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. ఫన్నీ టాస్క్ లు పెడుతూ అందులో గెలిచిన వారికి ఓటు అప్పీల్ ఛాన్స్ ఇస్తున్నాడు బిగ్ బాస్. అయితే ఫన్నీ టాస్క్ లు కాస్త సీరియస్ టాస్క్ లు అవుతున్నాయి. మరి బుధవారం ఏపిసోడ్ లో అమర్, అర్జున్ టాస్క్ లు గెలిచి ఓటు అప్పీల్ చేసుకునే అర్హతను సొంతం చేసుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ అవుతుంది. ఇక గురువారం ఎపిసోడ్ అక్కడినుండే మొదలవుతుంది. వీరిద్దరిలో ఎవరు ఓటు అడగటానికి అర్హులో హౌస్ మేట్స్ ఓట్స్ వేయాలి ఉంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనిలో భాగంగానే యావర్, ప్రశాంత్, శివాజీ అర్జున్ కు సపోర్ట్ చేయగా.. ప్రియాంక, శోభ అమర్ కు సపోర్ట్ చేశారు. మూడ ఓట్లతో అర్జున్ ఓటు అప్పీల్ ఛాన్స్ కొట్టేశాడు. ఈనేపథ్యంలో అర్జున్ తన బలంతో ఆడి ఇంతవరకూ వచ్చానని.. అయితే బలగం కూడా అవసరమని.. మీ సపోర్ట్ కావాలని కోరాడు.
అనంతరం మరో టాస్క్ ను పెట్టాడు బిగ్ బాస్. హౌస్ మేట్స్ కు ఒక టీ షర్ట్ ఇచ్చాడు. ఒక బోర్డర్ లైన్ పెట్టి అందులోనే ఉండి కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు బాల్స్ వేసుకోవాల్సి ఉంటుంది. ఎవరికి ఎక్కువ బాల్స్ అంటుకుంటాయో వారు గేమ్ నుండి అవుటయిపోతారు. ఇక గేమ్ మొదలవ్వగానే ఒకరి మీద ఒకరు బాల్స్ వేసుకుంటారు. ఈ క్రమంలో యావర్ శోభపై బాల్స్ వేస్తుంటాడు. ఇక శోభ కూడా రివర్స్ లో అటాక్ చేస్తుంది. అయితే శోభా కు ఎక్కువ బాల్స్ అంటుకోవడంతో గేమ్ నుండి అవుటవుతుందని తెలిసి యావర్ ను ట్రాప్ చేస్తుంది. లైన్ నుండి బయటకు వెళుతూ రా రా అంటూ యావర్ ను కూడా ప్రొవోక్ చేస్తుంది. యావర్ కూడా ఆవేశంతో బయటకు వెళతాడు. దీంతో బోర్డర్ లైన్ నుండి బయటకు రావడంతో ఇద్దరూ ఔట్ అంటూ చెబుతాడు బిగ్ బాస్. దీంతో యావర్ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.
ఇక ఇదే టాస్క్ లో ప్రశాంత్-అమర్ మధ్య పెద్ద గొడవనే జరుగుతుంది. ప్రశాంత్ కు బాల్స్ ను అంటించాలని ప్రశాంత్ దగ్గరకు వెళతాడు అమర్. బాల్స్ అంటించే క్రమంలో అమర్ బోర్డర్ ను దాటి బయటకు వెళతాడు.. అప్పుడే ప్రశాంత్ ను కూడా బయటకు లాగేస్తాడు. ఆ సమయంలో ప్రశాంత్ బయటకు వెళ్లకుండా ఉండటానికి ప్రయత్నించే క్రమంలో అమర్ మెడను పట్టుకోవాల్సి వస్తుంది. మరోవైపు అమర్ ప్రశాంత్ చేతిని కోరుకుతాడు. దీంతో ప్రశాంత్ కోరికావంటూ అమర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఇద్దరి మధ్య కాసేపు మాటల యుద్దం జరిగింది. అయితే ఇక్కడ అమర్ బ్యాాలెన్స్ కోల్పోయి విచిత్రంగా ప్రవర్తిస్తాడు. ప్రశాంత్ మెడికల్ రూమ్ కి వెళదాం పదా అని అనగా సరే పదా అంటూ ప్రశాంత్ ను నెట్టుకుంటూ వెళతాడు. వీరి గొడవతోనే నిన్న ఎపిసోడ్ పూర్తవుతుంది. మరి తరువాత ఓటు అడిగే ఛాన్స్ ఎవరికొస్తుందో చూడాలి..
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























