కేజీఎఫ్ స్టార్ యష్ కొత్త సినిమా టైటిల్ ఇదే..

KGF Star Yash New Movie Title Revealed

‘కే.జీ.ఎఫ్’ సినిమాతో ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్నారు కన్నడ రాక్ స్టార్ యష్. తొలుత పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. అనంతరం దీనికి సీక్వెల్‌గా వచ్చిన ‘కే.జీ.ఎఫ్ – చాప్టర్ 2’ మొదటి భాగానికి మించి సూపర్ హిట్ అయింది. కాగా ఈ సినిమాతో యష్.. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం మంచి గుర్తింపు పొందారు. దీంతో ఈసారి ఏకంగా రూ.1,000 కోట్లకు పైగా వసూళ్ళతో రాఖీభాయ్ తన సత్తా చూపించాడు. అయితే ఈ సినిమా వచ్చి ఏడాదిన్నర అవుతోంది. అప్పటినుంచి యష్ నుండి కొత్త సినిమా రాలేదు. దీంతో యష్ నుండి ఎలాంటి సినిమా వస్తుందా అని మూవీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో యష్ కొత్త సినిమాకి సంబంధించి అద్దిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. తాజాగా యష్19 గా వ్యవహరిస్తున్న ఈ మూవీ టైటిల్ అనౌన్స్‌మెంట్ చేశారు మేకర్స్. శుక్రవారం (డిసెంబర్ 8, 2023) ఉదయం 9 గంటల 55 నిమిషాలకు ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేశారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మించనున్న ఈ సినిమాకు ‘టాక్సిక్’ అని నామకరణం చేశారు. ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్స్ అప్’ అనేది ఉపశీర్షికగా ఉంది. ఇక ఈ చిత్రానికి ప్రముఖ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించనున్నారు. అలాగే ఈ మూవీ 2025 ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు కూడా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించి హీరో యష్ తన ఎక్స్ ఖాతా ద్వారా ‘టాక్సిక్’ టైటిల్ రివీల్ వీడియోను పంచుకున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.