సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గుంటూరు కారం. అతడు, ఖలేజా సినిమాల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసుకుంటున్న సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం ఏఎన్నార్ వర్చువల్ స్టూడియోలో చిత్రీకరిస్తున్నట్టు తెలిపారు. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో డైరెక్ట్ గా లొకేషన్ కి వెళ్లకుండా షూట్ చేయొచ్చు.. బ్యాక్గ్రౌండ్ లో లొకోషన్ నిజంగా ఉన్నట్టుగా ఉంటుంది. చిన్న సెటప్ తో షూటింగ్ కంప్లీట్ చేసేస్తారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
This is what we do …. Working with the best !
Team #ANRVirtual with Superstar @urstrulyMahesh Garu, Dynamic director #TrivikramSrinivas Garu & Talented DOP @manojdft Garu pic.twitter.com/wMKiRPeJyS
— ANR Virtual (@ANRVirtual) December 2, 2023
కాగా ఈ మధ్యే ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ధమ్ మసాలా సాంగ్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ పాట మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈసినిమాలో మహేష్ బాబు సరసన మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్న ఈసినిమాకు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. ఈసినిమాను సంక్రాంతి కానుకగా 2024, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























