జయాపజయాలతో పనిలేకుండా నితిన్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం అయితే నితిన్ నుండి రాబోతున్నసినిమా ఎక్స్ ట్రా ఆర్డినరీ. స్టార్ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్. ఈసినిమా డిసెంబర్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమా చిత్రయూనిట్ ప్రస్తుతం ఓ మాస్ సాంగ్ చిత్రీకరణలో బిజీగా ఉంది. మరోవైపు పోస్ట్ ప్రోడక్షన్ పనులు కూడా పూర్తిచేస్తూ రిలీజ్ సిద్దమవుతుంది. అంతేకాదు ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు. ఇప్పటకే పలు పాటలు, టీజర్ ను రిలీజ్ చేయగా ఇప్పుడు ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Mana Trailer ready ❤️
Monday 27th NOV Kummedhaaam 😁#ExtraOrdinaryManTrailer #ExtraOrdinaryManOnDec8th pic.twitter.com/UEVRDpCEmB
— nithiin (@actor_nithiin) November 24, 2023
కాగా ఈసినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























