గూఢచారి 2 పెద్ద స్పై ఫిలిం

adivi sesh interesting comments on Goodachari 2 movie

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివిశేష్ హీరోగా రాబోతున్న నెక్ట్స్ ప్రాజెక్ట్ గూఢచారి 2. ఈసినిమా గూఢచారి సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. 2018 లో వచ్చిన గూఢచారి బ్లాక్ బస్టర్ అయింది. ఈ నేపథ్యంలో ఈసినిమాకు సీక్వెల్ తీస్తున్నారు. ఈసినిమాను ఇప్పటికే ప్రకటించారు కానీ ఇంతవరకూ సెట్స్ పైకి వెళ్లలేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా అన్నా గూఢచారి అప్ డేట్ ఇస్తావా.. ఇయ్యవా అన్న.. లేకపోతే నీ మీద కంప్లైట్ ఇస్తా అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్ కు అడివి శెేష్ రిప్లై ఇస్తూ.. లవ్ యూ బ్రదర్.. షూటింగ్ కు ప్రిపరేషన్ జరుగుతుంది.పెద్ద ప్రాజెక్ట్.. పెద్ద సినిమా.. ఒక పెద్ద స్పై ఫిలింను చేస్తున్నప్పుడు..అంతే ఎఫర్ట్స్ అవసరం.. సో టైమ్ తీసుకుంటుంది అంటూ తెలిపాడు.

కాగా ఈసినిమాలో బనితా సంధు హీరోయిన్ గా నటిస్తుంది. మేజర్ ఎడిటర్ వినయ్ కుమార్ సిరిగినీడి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2, మేజర్ వంటి ఆల్ ఇండియా హిట్ ‌లను అందించిన ప్రముఖ నిర్మాతలు టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌ లపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.