అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన సినిమా భగవంత్ కేసరి. ఈ సినిమా అక్టోబర్ 19న విడుదలై మంచి విజయం సాధించింది. ఈసినిమాతో అనిల్ రావిపూడి లిస్ట్ ల ఖాతాలో మరో సినిమా చేరిపోవడమే కాకుండా బాలకృష్ణకు హ్యాట్రిక్ ఇచ్చింది. ఎమోషనల్ ప్లస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకొని ఫస్ట్ డే నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అందుకే దాదాపు 140 కోట్ల కలెక్షన్స్ ను అందించింది. అనిల్ కథ, బాలకృష్ణ-శ్రీలీల మధ్య ఎమోషనల్ సీన్స్, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్క్రీన్ అన్నీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా.. ఎప్పుడు చూద్దామా అని బాలయ్య ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ పై సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ వారు సొంతం చేసుకున్నారు. దీనిలో భాగంగానే ఈసినిమా నేటి నుండి (నవంబర్ 24) అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుందని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అన్ని భాషల్లోనూ ఈసినిమా అందుబాటులోకి వచ్చేసింది. మరి థియేటర్లలో చూడని వారు ఓటీటీ లో చూసి ఎంజాయ్ చేయండి.
#BlockbusterBhagavanthKesari is now streaming on @PrimeVideoIN in all Major Indian Languages ❤️🔥❤️🔥❤️🔥
Enjoy the Hindi Version of #BhagavanthKesari with the own dubbing of #NandamuriBalakrishna garu for the first time in Hindi 🔥
▶️ https://t.co/73nSPSzyil@AnilRavipudi… pic.twitter.com/bfug85oYsF
— Telugu FilmNagar (@telugufilmnagar) November 24, 2023
కాగా కాజల్ హీరోయిన్ గా నటించగా శ్రీలీల మరో కీలక పాత్రలో నటించింది. ఇప్పటివరకూ గ్లామర్ రోల్స్ చేసిన శ్రీలీల ఈసినిమాలో పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్ చేసింది. అర్జున్ రాంపాల్ విలన్ పాత్రలో నటించాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈసినిమాకు
సినిమాటోగ్రఫి.. సి.రామ్ ప్రసాద్, సంగీతం.. ఎస్ థమన్ అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























