బబుల్ గమ్- చిరు రిలీజ్ చేసిన ఇజ్జత్ సాంగ్

chiranjeevi launched bubble Gum movie izzat song

నటుడు రాజీవ్ కనకాల, స్టార్ యాంకర్ సుమల తనయుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. రవికాంత్ పెరెపు దర్శకత్వంలో బబుల్ గమ్ సినిమాతో రోషన్ హీరోగా పరిచయం అవ్వబోతున్నాడు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుపుకుంటుంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బీజీగా ఉంది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు. పాటలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా నుండి సెల్ఫ్ రెస్పెక్ట్ యాంథమ్ పేరుతో ఇజ్జత్ అనే సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే ఈపాట ప్రోమోను ఇప్పటికే రిలీజ్ చేయగా ప్రోమోనే ఆకట్టుకుంది. ఇప్పుడు ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. మెగాస్టార్ చేతుల మీదుగా ఈపాటను రిలీజ్ చేశారు మేకర్స్. ర్యాప్ సాంగ్ తరహాలో వచ్చిన ఈసాంగ్ యూత్ ను బాగానే ఆకట్టుకునేలా ఉంది. సాంగ్, విజువల్స్, రోషన్ స్టెప్స్ అన్నీ బాగున్నాయి. హరి లిరిక్స్ అందించడమే కాదు ఈపాటను కూడా పాడటం జరిగింది.

కాగా ఈసినిమాలో మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈసినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం.. సురేష్ రగుతు సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.