డెవిల్ సెకండ్ సింగిల్ గ్లింప్స్ కు డేట్ ఫిక్స్

Devil Second Single Glimpse Release Date

నవీన్ మేడారం దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా డెవిల్. 1940 బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈసినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటిస్తుండటంతో ఈసినిమాపై మొదటినుండీ అంచనాలు భారీగానే పెరిగాయి. దానికి తోడు పోస్టర్లు గ్లింప్స్ కూడా ఆసక్తికరంగా ఉండటంతో ఈసినిమాతో కూడా కళ్యాణ్ రామ్ మంచి హిట్ కొట్టే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. ఈసినిమా రిలీజ్ డేట్ ను రీసెంట్ గానే వాయిదా వేసిన సంగతి తెలిసిందే కదా. నిజానికి ఈసినిమాను ఈనెల 24వ తేదీన రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉండటంతో సినిమా రిలీజ్ వాయిదా పడింది. రిలీజ్ డేట్ త్వరలో ప్రకటించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ను ఇప్పటికే మొదలుపెట్టారు మేకర్స్. ఇప్పటికే మాయే చేసి అనే మొదటిపాటను రిలీజ్ చేయగా మెలోడియస్ గా ఉన్న ఈపాట బాగానే ఆకట్టుకుంటుంది. ఇప్పుడు సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు. ది ఈజ్ లేడీ రోజ్ అంటూ వచ్చే ఈ పాటను రిలీజ్ చేయనున్నారు. అయితే నవంబర్ 24వ తేదీన ఈపాట గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్.

కాగా ఈసినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెలుగు హిందీ తమిళం మరియు కన్నడ భాషలలో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.