సప్త సాగరాలు దాటి – సైడ్ బి ట్రైలర్ రిలీజ్

sapta Sagaralu Dhaati Side B trailer out now

కన్నడ సినిమాలకు కూడా ఇప్పుడు ఇక్కడ మంచి డిమాండ్ పెరిగింది. అందుకే అక్కడ హిట్ అయిన సినిమాలను ఇక్కడ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే రీసెంట్ గా కన్నడలో సూపర్ హిట్ అయిన సప్త సాగరాలు దాటి సినిమాను ఇక్కడ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. హేమంత్ ఎం రావు దర్శకత్వంలో రక్షిత్ శెట్టి హీరోగా వచ్చిన సినిమా సప్త సాగరాలు దాటి. ఈ సినిమా ఇక్కడ కూడా సూపర్ హిట్ అయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా రెండు భాగాలుగా వస్తున్న సంగతి తెలిసిందే కదా. నవంబర్ 17వ తేదీన ఈపార్ట్ ను రిలీజ్ చేయనున్నారు. సప్త సాగరాలు దాటి-సైడ్ బి అంటూ తెలుగులో రిలీజ్ అవుతుంది. ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ అయింది కాబట్టి సెకండ్ పార్ట్ పై అంచనాలు ఉండటం అనేది కామన్. ఈ పార్ట్ పై కూడా భారీ అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు మేకర్స్.

దీనిలోభాగంగానే తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది. మంచి ఎమోషనల్ సీన్స్ తో, సోల్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో, విజువల్స్ తో ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

కాగా ఈ సినిమాలో రక్షిత్‌ శెట్టి కి జోడీదా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. ఈసినిమాకు సంగీతం చరణ్ రాజ్ అందించారు. అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.