సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్డేట్ వచ్చేసింది.ఈ సినిమాలోని ఈ మొదటి పాట ధమ్ మసాలా ప్రోమోను రిలీజ్ చేయనున్నామని మేకర్స్ అధికారికంగా పోస్టర్ ద్వారా ప్రకటించారు.రేపు ఉదయం 11:07 గంటలకు ఈసాంగ్ ప్రోమోను వదులనున్నారు.ఈ ప్రోమో లో ఫుల్ సాంగ్ ఎప్పుడు రానుందో చెప్పనున్నారు.ఈనెల 7న ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారని సమాచారం.ఈ సాంగ్ పై మహేష్ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు.అయితే వారి అంచనాలను అందుకునే విధంగా తమన్ ఈ సాంగ్ ను కంపోజ్ చేశాడట.సో ఫస్ట్ సాంగ్ చార్ట్ బాస్టర్ కావడం పక్కా.ఇక ఈసందర్బంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో మహేష్ బీడీ తాగుతూ కనిపించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
WAIT IS OVER!! 🔥🤩
Get ready to witness The Highly Inflammable Superstar ‘s #GunturKaaram MASS in the first single #DumMasala 💥
Promo out TOMORROW 11:07 AM!
A @MusicThaman Musical 🎹🥁@urstrulyMahesh #Trivikram @sreeleela14 @meenakshiioffl @vamsi84 @manojdft @NavinNooli… pic.twitter.com/jpEwUxtLyz
— Haarika & Hassine Creations (@haarikahassine) November 4, 2023
త్రివిక్రమ్ డైరెక్షన్ లో యాక్షన్ &ఫ్యామిలీ ఎంటర్టైనెర్ గా తెరక్కుతున్న ఈసినిమాలో శ్రీ లీల,మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తుండగా రమ్యకృష్ణ ,ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది.ఈసినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కి బరిలో దించనున్నారు.ఇక త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ లో ఇది మూడో సినిమా. ఇంతకుముందు వీరి కాంబోలో అతడు,ఖలేజా సినిమాలు వచ్చాయి.కమర్షియల్ లెక్కలు పక్కన పెడితే ఈరెండు సినిమాలకు చాలా మంది ఫ్యాన్స్ వున్నారు. దాంతో ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం పై భారీ అంచనాలు వున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























