ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఎన్నో సమీకరణాలు ఉంటాయి. సినిమాకు కథ ఎంత ముఖ్యమో.. ఆసినిమాలో వచ్చేకొన్ని డైలాగ్స్ కూడా అంతే ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇక ఈ మధ్య కాలంలో వన్ లైనర్స్ కు బాగా అట్రాక్ట్ అవుతున్నారు ఆడియన్స్. అయితే అలాంటి డైలాగ్స్ రాయడం అనేది అందరి డైరెక్టర్లకు రాదు. ఒక్కొక్కరికీ ఒక్కో స్టైల్ ఉంటుంది. ఉదాహరణకు త్రివ్రికమ్ పలికించే డైలాగ్స్ సమాజం, విలువలు అన్నట్టు ఉంటాయి.. పూరీ దగ్గరకు వచ్చేసరికి రియలిస్టిక్ గా ఉంటాయి. ఇక కొరటాల ది కూడా సెపరేట్ స్టైల్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు కొరటాల దర్శకత్వంలో రాబోతున్న ఎన్టీఆర్ దేవర సినిమాలో కూడా అలాంటి పవర్ ఫుల్ వన్ లైనర్స్ చాలానే ఉన్నట్టు తెలుస్తుంది. వాటిలో మచ్చుకు కొన్ని డైలాగ్స్ ఇప్పుడు చూద్దాం.
*చిందిన ప్రతి రక్తపు బొట్టు ఒక ఆయుధం నుంచే

* ఒక మనిషి యొక్క కోపం ధైర్యం అనే వ్యాధికి నివారణ

* సముద్రమంతా రక్తంతో రాసిన అతని కథలే

* అతని కన్నా భయంకరమైనది అతని కథ మాత్రమే

* ఆయుధాన్ని పట్టుకున్న చెయ్యే ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన ఆయుధం

* ఆయుధాలు ఆ వ్యక్తి యొక్క భయంకరమైన కథను వర్ణిస్తాయి

* అతని ఆగమనంతో ఆయుధాలు వణుకుతున్నాయి

* ఒక ఆయుధం దానిని వాడే మనిషి నుండి శక్తిని పుంజుకుంటుంది

* మీకు తెలిసిన భయాన్ని మార్చడానికే అతడు ఉన్నాడు

* భయాన్ని మించిన దేవుడు లేడు

మరి ఇప్పుడు వినడానికే ఇలా ఉంటే సిల్వర్ స్క్రీన్ పై చూస్తే ఎంత పవర్ ఫుల్ గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫ్యాన్స మాస్ జాతర ఖచ్చితం అని చెప్పొచ్చు. మరి అది అలా చూడాలంటే కొన్ని నెలలు ఆగాల్సిందే.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా దేవర. కొరటాల శివ కూడా ఎక్కువ టైమ్ తీసుకొని మరి ఎన్టీఆర్ కోసం సాలిడ్ కథను తయారు చేశాడు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























