బిగ్ బాస్ సీజన్ 7 లో నాలుగు వారాలు పూర్తయిపోయి అయిదో వారంలోకి అడుగుపెట్టింది. నాలుగు వారాల్లో 14 మంది కంటెస్టెంట్స్ లో నలుగురు ఎలిమినేట్ అవ్వగా.. నాలుగు వారల్లో నలుగురు పవరాస్త్ర ను గెలుచుకున్నారు. అయితే వీకెండ్ ఎపిసోడ్ లో శివాజీకి అనర్హుడని చెప్పడంతో పవరాస్త్ర కోల్పోయాడు. దీంతో సందీప్, శోభాశెట్టి, ప్రశాంత్ లకు మాత్రమే పవరాస్త్ర ఉంది. ఇక 5వ వారంలో నామినేషన్స్ ప్రక్రియ జరిగిపోయింది. గొడవలు, అరుపులతో ఫుల్ వేడిగా నామినేషన్స్ జరగగా.. పవరాస్త్ర ఉన్నవారు మినహాయించి తేజ, ప్రియాంక, శివాజీ, శుభశ్రీ, అమర్ దీప్, ప్రిన్స్, గౌతమ్ అందరూ నామినేషన్ లోకి వచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక 5వ వారం ఎపిసోడ్ మొదలైందో లేదో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ట్విస్ట్ ఇచ్చాడు. ఇప్పటివరకూ పవరాస్త్రను గెలుచుకున్న సందీప్, శోభాశెట్టి అలానే ప్రశాంత్ పవరాస్త్రను ఇచ్చేయాలని అన్నాడు. దీంతో షాకైన కంటెస్టెంట్స్ తమ పవరాస్త్రను ఇచ్చేశారు. ఆ తరువాత హౌస్ మేట్స్ అందరికీ కలిపి ఒక టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. అయితే ఈసారి కెప్టెన్సీ టాస్క్ ను ఇచ్చాడు. ఏడో సీజన్‌లో కెప్టెన్ అయితే వాళ్లకు సూపర్ పవర్ వస్తుందని.. కెప్టెన్ అయిన వాళ్లు ఆ వారం నామినేషన్స్‌లో ఉంటే డైరెక్టుగా సేఫ్ అవడంతో పాటు తర్వాతి వారం జరిగే నామినేషన్స్‌లో మినహాయింపు పొందుతారని తెలిపారు. ఈ టాస్క్ లో భాగంగా హైస్ మేట్లను జోడీలుగా డివైడ్ అవ్వమనగా.. దీంతో గౌతమ్-శుభ శ్రీ, ప్రశాంత్-శివాజీ, ప్రియాంక-శోభా శెట్టి, ప్రిన్స్-తేజ, సందీప్-అమర్ దీప్ జోడీలుగా ఏర్పడతారు.
టాస్క్ ఏంటంటే.. స్మైలీ ఆకారంలో ఒక బోర్డ్ ఉంటుంది. అయితే అందులో కొన్ని దంతాలు మిస్ అవుతాయి. ఇక మిస్ అయిన దంతాలను అమర్చాల్సి ఉంటుంది. అలా అమర్చాలంటే లాన్ లో ఉన్న ఏరియా నుండి పాకు కుంటూ వెళ్లి యాక్టివిటీ ఏరియాలోని ప్లేసుల్లో వెతికి వాటిని తీసుకొచ్చి అమర్చాలి. ముందు అమర్చినవారు బెల్ కొట్టాల్సి ఉంటుంది. సంచాలకులిగా శోభా శెట్టిని అలానే ప్రిన్స్ ను పెట్టాడు బిగ్ బాస్.
ఇక ఈ టాస్క్ ఎంత గందరగోళంగా జరగాలో అంత గజిబిజీగా చేశారు కంటెస్టెంట్స్. ముందు ప్రశాంత్-శివాజీ బెల్ కొట్టినా వారు సరిగ్గా అమర్చలేకపోయారు.. ఆ తరువాత సందీప్-అమర్ టాస్క్ పూర్తి కాకముందే బజర్ కొట్టారు. వారి తరువాత గౌతమ్-శుభశ్రీ బెల్ కొట్టారు..ఆ తరువాత ప్రియాంక-శోభాశెట్టి కొట్టారు. బజర్ మోగిన తరువాత ప్రిన్స్-తేజ టాస్క్ పూర్తిచేశారు. అయితే ఈ టాస్క్ లో అందరూ తప్పులు చేయడంతో సంచాలకులుగా ఉన్న శోభా-ప్రిన్స్ చాలా సేపు ఫైనల్ డెసిషన్ చెప్పలేకపోతారు. బిగ్ బాస్ కే నిర్ణయం వదిలేసినా బిగ్ బాస్ మాత్రం ప్రిన్స్-శోభా శెట్టినే చెప్పాలని అనడంతో పైనల్ గా మొదటిస్థానం గౌతమ్-శోభ శ్రీకి సెకండ్ ప్లేస్ అమర్-సందీప్ కు థర్డ్ ప్లేస్ శివాజీ-ప్రశాంత్ కు నాలుగో ప్లేస్ శోభా-ప్రియాంకకు అయిదో ప్లేస్ ప్రిన్స్-తేజకు ఫిక్స్ చేస్తూ తెలిపారు. అయితే ఇందుకు ప్రియాంక మాత్రం ఒప్పుకోలేదు. ఈ డిస్కషన్స్ తో ఎపిసోడ్ పూర్తవుతుంది. మరి నేటి ఎపిసోడ్ లో ఇంకా రచ్చ జరగేలా కనిపిస్తుంది. చూద్దాం ఫైనల్ గా ఏం జరుగుతుందో..
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























