ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే కదా. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నార్నె నితిన్ హీరోగా వస్తున్న సినిమా మ్యాడ్. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతున్నట్టు ఇప్పటికే వచ్చిన అప్ డేట్లను బట్టి అర్థమైపోయింది. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు మేకర్స్. అక్టోబర్ 4వ తేదీన ఫిలిం నగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో సాయంత్రం 6 గంటల నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇక ఈ ఈవెంట్ కు మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ అతిథిగా రానున్నాడు. ఈ విషయాన్ని కూడా అతిథిగా తెలియచేశారు మేకర్స్.
Our Lucky Baskhar @dulQuer is going to grace the grand pre-release event of #MAD on OCT 4th at JRC Convention Film Nagar, HYD! 🤩🥳#MADTrailer – https://t.co/lyfLSjtkCS
In cinemas #MADon6thOctober 😎@kalyanshankar23 @vamsi84 #HarikaSuryadevara #SaiSoujanya @NarneNithiin… pic.twitter.com/M1M0VA1Vyn
— Sithara Entertainments (@SitharaEnts) October 3, 2023
కాగా సంగీత్ శోభన్,రామ్ నితిన్ కీలక పాత్రల్లో నటించగా..గౌరీ ప్రియా,అనంతిక,గోపిక ఉదయన్ హీరోయిన్లు గా నటిస్తున్నారు.మురళీధర్ గౌడ్,రఘు బాబు,విష్ణు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటెర్టైమెంట్స్ బ్యానర్ పై నాగవంశీ సోదరి సూర్యదేవర హారిక ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























