ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నుండి వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో భారీ బడ్జెట్ తో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో అంటే అటు ఐఏఎస్ పాత్రలో మరోవైపు గ్రామస్థుడిగా కనిపించనున్నాడట. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. అయితే ఈమధ్య కాస్త గ్యాప్ రావడంతో షూట్ కు బ్రేక్ పడింది. రీసెంట్ గానే మళ్లీ షూటింగ్ ను మొదలుపెట్టారు. ఇక ఎలాంటి బ్రేక్ లు లేకుండా షూట్ ను పూర్తిచేయాలని మేకర్స్ పూర్తి చేయాలని చిత్రయూనిట్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమాకు సంబంధించి ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ను వినిపిస్తుంది. ఈసినిమా క్లైమాక్స్ షూటింగ్ రీసెంట్ గానే చిత్రయూనిట్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే కదా. దాదాపు 500 మందితో ఈ క్లైమాక్స్ ను షూట్ చేయగా.. ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు. ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ఈ సీక్వెన్స్ ఉంటాయట. మరి శంకర్ సినిమా కాబట్టి ఆమాత్ర ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.. అయితే ఆహైలెట్స్ ను చూడాలంటే మాత్రం సినిమా వచ్చేంతవరకూ ఆగాల్సిందే.
కాగా గేమ్ ఛేంజర్ సినిమాలో కియారా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































