మామన్నన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

maamannan ott release date fixed

సెల్వరాజ్ దర్శకత్వంలో ఉదయ్ నిధి స్టాలిన్ హీరోగా వచ్చిన సినిమా మామన్నన్. పొలిటిల్ బ్యాక్ డ్రాప్ లో తమిల్ వచ్చిన ఈసినిమా అక్కడ సూపర్ హిట్ టాన్ ను తెచ్చుకుంది. మొదటిరోజే ఈసినిమా 5కోట్ల కలెక్షన్స్ రాబట్టుకుందంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత ప్రజాదారణ పొందిందే. ఇక ఈసినిమాలో వడివేలు, కీర్తి సురేష్, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించారు. ఎ.ఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమాను ఇటీవలే తెలుగులో కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. నాయకుడు అనే టైటిల్ తో ఈసినిమా రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థలు సురేష్ ప్రొడక్షన్స్ వారు అలాగే ఆసియన్ సినిమాస్ వారు సొంతం చేసుకొని జులై 14వ తేదీన రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు ఈసినిమా హక్కులను సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. ఈసినిమాను జులై 27వ తేదీన ఈసినిమా స్ట్రీమింగ్ కు రానుంది. తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ,మలయాళం భాషల్లో ఈసినిమా అందుబాటులోకి రానుంది. మరి థియేటర్లలో చూడని వారు ఓటీటీ లో చూసి ఎంజాయ్ చేయొచ్చు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.