డిసి ఓటీటీ విడుదల తేది ఖరారు

DC Set for Its OTT Premiere

స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కథానాయకుడిగా పరిచయమైన తమిళ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘డిసి’ డిజిటల్ ప్రిమియర్‌కు సిద్ధమైంది. ఆగస్టు 7న థియేటర్లలో విడుదలై అంతర్జాతీయంగా ₹100 కోట్లకు పైగా వసూళ్ సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా ఓటీటీ హక్కులను సన్ నెక్స్ట్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థలు సొంతం చేసుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రంలో లోకేష్ కనగరాజ్ సరసన వామికా గబ్బి కథానాయికగా నటించింది. ఇప్పటివరకు కెమెరా వెనుక ఉండి సంచలన సినిమాలు తెరకెక్కించిన లోకేష్, ఇందులో రఫ్ అండ్ మాస్ హీరోగా కెమెరా ముందుకు వచ్చి ప్రేక్షకులను, క్రిటిక్స్‌ను మెప్పించారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన ఇంటెన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.

బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన ఈ చిత్రం సెప్టెంబర్ 4 నుండి ఒకేసారి సన్ నెక్స్ట్, ప్రైమ్ వీడియో రెండు ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళ భాషల్లోనూ ఇది అందుబాటులోకి రానుండటంతో థియేటర్లలో మిస్సయిన డిజిటల్ ప్రేక్షకులు ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను ఇంట్లోనే వీక్షించవచ్చు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.