అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి సినిమా సెట్స్‌లో ఎంత నిక్కచ్చిగా ఉంటారో, తాను అనుకున్న సన్నివేశాన్ని అనుకున్నట్టుగా తెరపైకి తీసుకొచ్చే విషయంలో ఏమాత్రం రాజీపడరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ సైతం సెట్స్‌లో రాజమౌళి పనితీరును చూసి ఆశ్చర్యపోయినట్లు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రంలో పృథ్వీరాజ్ ప్రతినాయకుడిగా (విలన్ – కుంభ అనే పాత్రలో) నటిస్తున్న విషయం తెలిసిందే.తాజాగా ఆయన ఇంటర్వ్యూ లో మాట్లాడూతూ ..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు రాజమౌళి ఓ సన్నివేశం కోసం 90కిపైగా టేక్స్ తీసుకున్న సందర్భాలూ ఉన్నాయి. అనుకున్నట్టుగా సీన్ రావడం కోసం ఉదయం నుంచి రాత్రి వరకూ చిత్రీకరణ చేయడానికి ఆయన వెనకాడరు. అప్పటికీ సంతృప్తి చెందకపోతే మళ్లీ మరుసటి రోజు ఉదయం కూడా అదే సన్నివేశాన్ని తీస్తారు. నేను ఇప్పటివరకు రాజమౌళిలా కష్టపడే దర్శకుడిని చూడలేదు. ఉదయం 7 గంటలకు తొలి షాట్ అనుకుంటే, ఆయన ఉదయం 5 గంటలకే సెట్స్‌కి చేరుకుంటారు.” అని పృథ్వీరాజ్ చెప్పారు.
అలాగే ఎన్నో ఏళ్లు ఎదురుచూశాక అప్పుడే తొలి అవకాశం అందుకున్న ఒక కొత్త దర్శకుడిలా ఆయన కసితో పనిచేస్తారని, నటులకు భావోద్వేగాలు అర్థం కావడం కోసం రాజమౌళి స్వయంగా ఆ పాత్రలో జీవించి నటిస్తూ చూపిస్తారని కొనియాడారు. మహోన్నత నటుడు మోహన్‌లాల్ తర్వాత మళ్లీ ఓ దర్శకుడిలో అంత గొప్ప నటుడిని తాను చూసింది కేవలం రాజమౌళిలోనేనని, ఆయనతో పనిచేయడం వల్ల ఒక నటుడిగా, దర్శకుడిగా తనకు ఎంతో పరిణతి లభించిందని పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్పుకొచ్చారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























