చిరు158 చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా విజయ్ కార్తిక్ కన్నన్

Vijay Kartik Kannan On Board as Cinematographer for Chiru 158

మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ సంక్రాంతి బ్లాక్‌బస్టర్ వాల్తేర్ వీరయ్య తర్వాత మరో మాస్ ఎంటర్‌టైనర్ కోసం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లితో మరోసారి జతకడుతున్నారు. ఈ చిత్రాన్ని సుప్రసిద్ధ బ్యానర్ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. #చిరుబాబీ2 / #చిరు158  మే 21న అధికారికంగా ప్రారంభం కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు మేకర్స్ టీమ్‌లోకి మరో బలమైన టెక్నికల్ టాలెంట్‌ను తీసుకొచ్చారు. ‘జైలర్’, ‘డాకూ మహారాజ్’, అలాగే రాబోయే ‘జైలర్ 2’ చిత్రాలతో తన విజువల్ స్టైల్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తిక్ కన్నన్ ఈ చిత్రానికి డీవోపీగా అధికారికంగా జాయిన్ అయ్యారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రకటన చేయడంతో ఈ అప్డేట్ మరింత స్పెషల్‌గా మారింది. గతంలో బాబీ కొల్లితో కలిసి పని చేసిన విజయ్ కార్తిక్ కన్నన్, ఈసారి కూడా తన ప్రత్యేక విజువల్ టచ్‌తో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లనున్నారు.

ఇప్పటికే విడుదలైన లుక్ టెస్ట్ ఇమేజెస్, అనౌన్స్‌మెంట్ పోస్టర్, అలాగే చిరంజీవి జిమ్ ట్రాన్స్‌ఫర్మేషన్ వీడియో ఆయన కొత్త స్టైలిష్ అవతార్‌పై భారీ ఆసక్తిని పెంచాయి.

మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌ను గ్రాండ్‌గా తెరకెక్కించడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న బాబీ కొల్లి, ఈసారి చిరంజీవిని ఇప్పటివరకు చూడని అత్యంత పవర్‌ఫుల్ అవతార్‌లో చూపించబోతున్నారు. మెగాస్టార్ స్క్రీన్ ప్రెజెన్స్‌ను మరింత ఎలివేట్ చేసేలా రూపొందుతున్న ఈ చిత్రం పవర్‌ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్, హై వోల్టేజ్ ఎలివేషన్స్, థియేటర్లను షేక్ చేసే మాస్ మూమెంట్స్‌తో ఉండబోతోంది.

ఇతర నటీనటులు, టెక్నికల్ టీమ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.