పెద్ది ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్

Peddi Trailer to Arrive on This Date

రామ్ చరణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘పెద్ది’ సినిమా ట్రైలర్ అప్‌డేట్ వచ్చేసింది. మే 16న ట్రైలర్ వస్తుందని భావించినప్పటికీ మేకర్స్ కొత్త తేదీ ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మే 18న ఈ చిత్ర ట్రైలర్‌ను గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. “పెద్ది మీ హృదయాల్లో నిలిచిపోతుంది” అంటూ చిత్ర యూనిట్ ఈ అప్‌డేట్‌ను పంచుకుంది. ఈ సినిమా జూన్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. అయితే ఒక రోజు ముందుగానే, అంటే జూన్ 3న భారీ ఎత్తున ప్రీమియర్ షోలు ప్రదర్శించబడతాయి.

ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న ఈ పీరియడ్ స్పోర్ట్స్ డ్రామాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన రెండు పాటలు , టీజర్ భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. మే 18న రాబోయే ట్రైలర్ ఈ అంచనాలను మరింత పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.