మాస్ మహారాజ రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇరుముడి’ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. భక్తి మరియు భావోద్వేగాల నేపథ్యంలో సాగే ఈ సినిమా చిత్రీకరణ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా షూటింగ్ దాదాపు 90 శాతం పూర్తయింది. ఇంకా కేవలం ఒక నెల రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. ఈ తుది షెడ్యూల్‌ను పూర్తి చేసేందుకు చిత్ర బృందం తీవ్రంగా శ్రమిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియా భవాని శంకర్ కథానాయికగా నటిస్తుండగా, జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు.
రవితేజ మునుపటి చిత్రాలకు భిన్నంగా, ఇందులో ఒక పవర్‌ఫుల్ మరియు ఎమోషనల్ పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. యాక్షన్ అంశాలతో పాటు ఆధ్యాత్మికత మరియు భావోద్వేగాలకు ప్రాధాన్యత ఉన్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అతి త్వరలోనే ఈ షూటింగ్ పూర్తి చేసి, ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























