విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాన్ని ‘హాయ్ నాన్న’ ఫేమ్ దర్శకుడు శౌర్యువ్‌తో చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం (#VDxShouryuv) ఒక భారీ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కనుంది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమా కోసం అంతర్జాతీయ స్థాయి సాంకేతిక నిపుణులను ఎంపిక చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హాలీవుడ్ విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుడు ఎరిక్ డర్స్ట్, ఇంటర్నేషనల్ సినిమాటోగ్రాఫర్ అలెజాండ్రో మార్టినెజ్ వంటి హేమాహేమీలు ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.’ఖుషి’ చిత్రానికి అద్భుతమైన బాణీలు అందించిన హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు.ప్రముఖ ఎడిటర్ ప్రవీణ్ ఆంటోనీ, ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వరాజన్ మరియు కాస్ట్యూమ్ డిజైనర్ సచిన్ లోవలేకర్ ఈ టీమ్‌లో భాగమయ్యారు.
దర్శకుడు శౌర్యువ్ మొదటి సినిమా ‘హాయ్ నాన్న’ క్లాస్ ఎమోషనల్ మూవీగా గుర్తింపు పొందగా, ఈ సినిమా దానికి పూర్తి భిన్నంగా గ్లోబల్ స్థాయిలో భారీ యాక్షన్ ఎపిసోడ్లతో ఉండబోతోంది. విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ సినిమా అని, ఇందులో ఆయన వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నారని చిత్ర బృందం వెల్లడించింది. ఈ ప్రకటనతో విజయ్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ రణబాలి ,రౌడీ జనార్ధన సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు పూర్తి చేసిన తరువాత విజయ్ , శౌర్యువ్ తో సినిమా మొదలుపెట్టనున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























