ధురంధర్ ది రివెంజ్ : ఇండియాలోనే 1000కోట్లు

₹1000 Crore Milestone in India for ‘Dhurandhar The Revenge

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్: ది రివెంజ్’ భారతీయ సినిమా చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో రికార్డులను తిరగరాస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఒక అసలైన ‘బబ్బర్ షేర్’లా గర్జిస్తూ, కేవలం 18 రోజుల్లోనే ఈ చిత్రం అద్భుతమైన మైలురాళ్లను అధిగమించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రం కేవలం 18 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹1622 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. భారతదేశంలో ₹1000 కోట్ల నెట్ మార్కును దాటిన ఏకైక చిత్రంగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఇండియాలో ఇప్పటివరకు ఈ చిత్రం ₹1041 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. విదేశీ మార్కెట్‌లో కూడా ₹394 కోట్ల గ్రాస్ వసూళ్లతో రణవీర్ సింగ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ గ్లోబల్ హిట్‌గా నిలిచింది.

డే-వైజ్ బ్రేకప్ (ఇండియా నెట్):

మొదటి వారంలోనే ₹690 కోట్లతో భారీ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ చిత్రం, రెండో వారంలో ₹271 కోట్లు సాధించి తన జోరును కొనసాగించింది. మూడో వీకెండ్‌లో కూడా వసూళ్లు తగ్గకుండా.. 16వ రోజు ₹23 కోట్లు, 17వ రోజు ₹27 కోట్లు, మరియు 18వ రోజు ₹30 కోట్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని చాటుకుంది. జియో స్టూడియోస్ మరియు బి62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం, ఇండియన్ సినిమా స్టామినాను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పింది. హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ మరియు రణవీర్ సింగ్ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టిస్తున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.