జెట్లీ నుండి వీడియో సాంగ్ రిలీజ్

Satya Is Not Jet lee video song out now

ప్రముఖ కమెడియన్ సత్య కథానాయకుడిగా రూపొందుతున్న క్రేజీ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ‘జెట్లీ’ నుండి ఈరోజు వీడియో సాంగ్ విడుదలైంది. రితేష్ రానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉండగా, తాజాగా ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ పాటకు “సత్య ఈజ్ నాట్ జెట్లీ” అనే ఆసక్తికరమైన టైటిల్ ఇచ్చారు. కాల భైరవ అందించిన అదిరిపోయే మాస్ అండ్ ఎనర్జిటిక్ ట్యూన్‌కు సత్య తనదైన గ్రేస్‌ఫుల్ స్టెప్పులు మరియు కామెడీ టైమింగ్‌తో ప్రాణం పోశారు. ఈ వీడియో సాంగ్‌లో సత్య వెరైటీ గెటప్స్, ఆయన మేనరిజమ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా విజువల్స్ చాలా కలర్‌ఫుల్‌గా వున్నాయి.

మైత్రీ మూవీ మేకర్స్ మరియు క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా, విమానం హైజాక్ నేపథ్యంలో సాగే ఒక సెటైరికల్ డ్రామా. సత్య సరసన రియా సింఘా హీరోయిన్‌గా నటించగా , వెన్నెల కిశోర్ తనదైన శైలిలో నవ్వులు పూయించనున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం, సమ్మర్ కానుకగా థియేటర్లలోకి రానుంది. ఈ ఫుల్ వీడియో సాంగ్ విడుదలతో సినిమా ప్రమోషన్లలో ‘జెట్లీ’ టీమ్ వేగాన్ని పెంచింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.