ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ AA 22 X A6 నుండి అప్డేట్ రానుంది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8, 2026న ఈ సినిమా అధికారిక టైటిల్‌ను వెల్లడించబోతున్నట్లు సమాచారం. కేవలం ఒక పోస్టర్ మాత్రమే విడుదలకానుంది. వీడియో కంటెంట్ ఆశించిన అభిమానులకు నిరాశ తప్పకపోవచ్చు. ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్ మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త అవతారాల్లో కనిపించనుండగా ఇది ఒక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సినిమా చిత్రీకరణ ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది. అయితే ఏప్రిల్‌లో దుబాయ్‌లో జరగాల్సిన భారీ యాక్షన్ షెడ్యూల్ ప్రస్తుత అంతర్జాతీయ ఉద్రిక్తతల కారణంగా రద్దు చేయబడింది. చిత్ర యూనిట్ ఇప్పుడు ప్రత్యామ్నాయ లొకేషన్ల కోసం వెతుకుతోంది.
బాలీవుడ్ స్టార్ దీపికా పదుకోన్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. అలాగే మృణాల్ ఠాకూర్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తుందని ప్రచారం జరుగుతుంది. సాయి అభ్యంకార్ సంగీతం అందించే అవకాశాలు వున్నాయి. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్నంటాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























