అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’ విడుదల తేదీపై చిత్ర యూనిట్ అధికారికంగా క్లారిటీ ఇచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
భారతీయ పురాతన ఆలయాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక మర్మాలను, ముఖ్యంగా పద్మనాభస్వామి ఆలయం మరియు పూరీ జగన్నాథుడి ఆలయాల్లోని రహస్య గదుల ఇతివృత్తంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూలై 3, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
‘పెద్దకాపు’ చిత్రంతో మెప్పించిన యువ హీరో విరాట్ కర్ణ ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆయనకు జోడీగా నభా నటేష్, ఐశ్వర్య మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. వెర్సటైల్ నటుడు జగపతి బాబు ప్రభాకర్ అనే కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఇంకా మురళీ శర్మ, అనసూయ భరద్వాజ్, సన్యా పొన్వన్నన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
1750వ కాలం నాటి చారిత్రక అంశాలను మేళవిస్తూ, భూమి అడుగున దాగిన ‘నాగబంధం’ అనే మర్మమైన నిధిని కాపాడే క్రమంలో సాగే ఉత్కంఠభరితమైన ప్రయాణమే ఈ సినిమా. సుమారు 108 విష్ణు దేవాలయాల చుట్టూ ఉన్న రహస్యాలను ఈ సినిమాలో ఆవిష్కరించబోతున్నారు.
అభిషేక్ పిక్చర్స్ మరియు ఎన్ఐకె స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, అభే మరియు జునైద్ కుమార్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. భారీ సెట్లు మరియు ఉన్నత స్థాయి విఎఫ్ఎక్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ మరియు మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.టీజర్ తో ఇప్పటికే ఈసినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























