డాల్బీ సినిమాస్ ఫార్మెట్‌లో పెద్ది 

Peddi to Release in Dolby Cinema Format

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  పాన్-ఇండియా యాక్షన్ డ్రామా పెద్ది పోస్ట్-ప్రొడక్షన్, ప్రమోషనల్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. బుచ్చి బాబు సనా దర్శకత్వంలో, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం మరో ప్రత్యేకతను సొంతం చేసుకుంది. ఈ చిత్రం అత్యాధునిక డాల్బీ సినిమాస్ ఫార్మెట్‌లో కూడా విడుదల కానుంది. రామ్ చరణ్  మాస్ రగ్గడ్ అవతార్‌ను డాల్బీ సినిమాస్ ఫార్మెట్‌ లో చూడడం ప్రేక్షకులకు మరింత గ్రాండ్  ఎక్స్ పీరియన్స్ అందించనుంది. పెద్ది వంటి భారీ యాక్షన్, ఎమోషన్ కలిగిన సినిమాను డాల్బీ సినిమాస్ లో చూడడం ప్రేక్షకులకు పూర్తిగా లీనమయ్యే అనుభూతిని ఇవ్వనుంది.

ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్‌లో రామ్ చరణ్ రగ్డ్ అవతార్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. చేతిలో బ్యాట్ పట్టుకుని, ఇంటెన్స్ లుక్‌తో కనిపిస్తున్న ఆయన క్యారెక్టర్ సినిమాలో పవర్‌ఫుల్ యాక్షన్‌ను సూచిస్తోంది. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

పెద్ది ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే సంచలనం క్రియేట్ చేస్తోంది. పెద్ది ఫస్ట్ షాట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.ఎఆర్ రెహమాన్ అందించిన సౌండ్‌ట్రాక్స్ మెగా చార్ట్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. చికిరి చికిరి,  రైరై రా రా పాటలు వరల్డ్ వైడ్ వైరల్ అయ్యాయి.ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు,  బోమన్ ఇరానీ ఇతర ప్రముఖ పాత్రలను పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. సినిమాటోగ్రాఫర్ ఆర్ రత్నవేలు, ఎడిటర్ నవీన్ నూలి,  ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా.పెద్ది సమ్మర్ సీజన్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలువడానికి సిద్ధమౌతోంది.  

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.