రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చిన మూడు సినిమాలు ఈ రోజు ఒకేసారి ఓటీటీల్లోకి వచ్చాయి. ఇందులో మాస్ మహారాజా రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి ,విశ్వక్ సేన్ ఫంకీ , సంతోష్ శోభన్ కపుల్ ఫ్రెండ్లీ వున్నాయి. ఈసినిమాలు మూడు వేరు వేరు ఓటీటీల్లోకి వచ్చేశాయ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
భర్త మహాశయులకు విజ్ఞప్తి :
రవితేజ హీరోగా, కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ జీ5 (ZEE5) లో ఈరోజు నుండి స్ట్రీమింగ్ అవుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాన్ని అందుకున్నప్పటికీ, రవితేజ కామెడీ టైమింగ్ కోసం అభిమానులు ఓటీటీలో చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో రవితేజ సరసన డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ నటించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది.
ఫంకీ :
విశ్వక్ సేన్, కాయడు లోహర్ జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ నెట్ఫ్లిక్స్ లో ఈరోజు నుండి స్ట్రీమింగ్ మొదలైంది. ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం, ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదలైంది. సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినప్పటికీ, అనుదీప్ మార్క్ సెటైరికల్ కామెడీ కోసం చాలామంది ఓటీటీ విడుదల కోసం ఎదురుచూశారు. ఇది తెలుగు, తమిళ, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది.
కపుల్ ఫ్రెండ్లీ :
సంతోష్ శోభన్, మానస వారణాసి నటించిన ఈ ఫీల్-గుడ్ రొమాంటిక్ డ్రామా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, మౌత్ టాక్తో పుంజుకుని మంచి విజయాన్ని నమోదు చేసింది. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం, యువత మరియు ఫ్యామిలీ ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా తెలుగు మరియు తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































