కన్నడ సూపర్ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ట్రైలర్‌ను 2026, మార్చి 8న బెంగళూరులో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్లు సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్‌తో సంచలనం సృష్టించగా, ఇప్పుడు ట్రైలర్‌తో సినిమాపై ఉన్న అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.అయితే అదే రోజు టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగాల్సివుంది. ఒకవేళ ఇండియా ఫైనల్ కు చేరితే ట్రైలర్ రిలీజ్ ను వాయిదా వేసే అవకాశం లేకపోలేదు.
ఈ చిత్రంలో యష్ సరసన నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి , రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సుమారు రూ. 600 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం కేవలం ప్రీ-రిలీజ్ బిజినెస్ ద్వారానే పెట్టిన పెట్టుబడిని వెనక్కి రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2026, మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది. ఉగాది మరియు ఈద్ పండుగల సెలవులను దృష్టిలో ఉంచుకుని ఈ తేదీని ఖరారు చేశారు.అయితే ఆ రోజున హిందీలో రణవీర్ సింగ్ నటించిన ‘ధురందర్ 2’ కూడా విడుదల కానుండటంతో బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొననుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























