ఫంకీ ఓటీటీ డేట్ లాక్

Funky OTT Release Date Locked

విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఫంకీ’ ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. థియేటర్లలో ఫిబ్రవరి 13, 2026న విడుదలైన ఈ చిత్రం, సరిగ్గా ఒక నెల తర్వాత అంటే మార్చి 13, 2026 నుండి ఓటీటీలో అందుబాటులోకి రానుందని సమాచారం. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.అయితే ఈ రిలీజ్ డేట్ పై నెట్ ఫ్లిక్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సివుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘జాతి రత్నాలు’ ఫేమ్ అనుదీప్ కె.వి. ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆయన మార్కు విభిన్నమైన కామెడీతో ఈ సినిమా సాగుతుంది.విశ్వక్ సేన్ సరసన కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించింది. సీనియర్ నటుడు నరేష్, విటివి గణేష్ ఇతర కీలక పాత్రలు పోషించారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. .ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినా, ఓటీటీలో ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం భావిస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.