హే బల్‌వంత్ 3 డేస్ కలెక్షన్స్

Hey Balawanth 3-Day Box Office Collections

సుహాస్, శివానీ నాగారం జంటగా నటించిన ‘హే బల్‌వంత్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మూడు రోజుల్లో మంచి వసూళ్లు సాధించింది. పాజిటివ్ టాక్‌తో మొదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద స్థిరంగా రాణిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మొదటి రోజు సుమారు ₹2.14 కోట్ల గ్రాస్ వసూళ్లు.రెండో రోజు వసూళ్లు స్వల్పంగా పెరిగి సుమారు ₹2.30 కోట్ల గ్రాస్ సాధించింది.మూడో రోజు సెలవు దినం కావడంతో స్ట్రాంగ్ హోల్డ్ ను కొనసాగించింది. దాంతో ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం మూడు రోజుల్లో సుమారు ₹5.93 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది, అక్కడ ఇప్పటివరకు సుమారు $210k వసూలు చేసింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే 8కోట్లపైనే రాబట్టాల్సివుంది. బ్రేక్ ఈవెన్ మార్కును చేరుకుని క్లీన్ హిట్ అనిపించుకోవాలంటే ఈ సినిమా వీక్ డేస్‌లో కూడా ఇదే జోరును కొనసాగించాల్సి ఉంటుంది.

ఇక మేకర్స్ ఈసినిమాను ఇప్పుడు సాధారణ ప్రేక్షకులకు మరింత చేరువచేసేందుకు ఒక అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది.తెలుగు రాష్ట్రాల్లోని మెజారిటీ థియేటర్లలో ఈ సినిమా టికెట్ ధరను కేవలం 99 రూపాయలకే అందుబాటులోకి తెచ్చినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. “అందరికీ అందుబాటులో ఉండే వినోదం” అనే నినాదంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పెద్ద సినిమాల టికెట్ ధరలు సామాన్యులకు భారంగా మారుతున్న తరుణంలో, ఒక నవ్వుల విందు లాంటి సినిమాను ఇంత తక్కువ ధరకే అందించడం ప్రేక్షకులకు పెద్ద ఊరటనిస్తోంది.

గోపీ అచ్చర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోకామెడీ మరియు ఫాదర్-సన్ ఎమోషన్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవ్వడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారింది.వివేక్ సాగర్ అందించిన సంగీతం సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చింది. ఈ 99 రూపాయల టికెట్ ఆఫర్ వల్ల వీకెండ్‌లో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.