యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో నిరంజన్, ఐశ్వర్య అర్జున్ జంటగా తెరకెక్కించిన చిత్రం ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ మీద అర్జున్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీతో ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో యాక్షన్ ప్రిన్స్ ధృవ సర్జా ప్రధాన పాత్రను పోషించారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు హాస్య బ్రహ్మ, పద్మశ్రీ డా. బ్రహ్మానందం ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో రియల్ హీరోలైన పర్యావరణ వేత్త, సామాజిక వేత్త డా. ప్రకాష్ ఆమ్టే, డా. మందాకిని ఆమ్టే, ట్యాంక్ బండ్ శివ, పర్యావరణ వేత్త దుశ్చర్ల సత్యనారాయణ తదితరులని ‘సీతా పయనం’ టీం సత్కరించి లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శక, నిర్మాత అర్జున్ సర్జా మాట్లాడుతూ .. ‘‘సీతా పయనం’ అనేది ఒక్కరి ప్రయాణం కాదు. నా కూతురిని ఓ మంచి కథతో, పాజిటివిటీ ఉన్న సినిమాతో పరిచయం చేయాలని అనుకున్నాను. ఇదొక డిఫరెంట్ జానర్ కథ. నా కూతురికి ఓ బహుమతిలా ఈ సినిమాని ఇవ్వాలని అనుకున్నాను. జనాలకు ఓ మంచి చిత్రాన్ని ఇవ్వాలనే బాధ్యతతో ఈ చిత్రాన్ని తీశాను. ఎంతో నిజాయితీతో ఈ మూవీని తీశాను. ఉపేంద్ర గారి అన్న కొడుకు నిరంజన్ చాలా టాలెంటెడ్ పర్సన్. అభి పాత్రలో అద్బుతంగా నటించాడు. నా కూతురి గురించి నేను కాకుండా ఆడియెన్స్ చెప్పాలి. ఈ చిత్రంలో ఐశ్వర్యను చూసి అందరూ మెచ్చుకుంటారని భావిస్తున్నాను. సత్య రాజ్ గారు చెప్పిన టైంకి, చెప్పిన డేట్లకు పర్‌ఫెక్ట్‌గా వచ్చారు. ఫాదర్ అండ్ డాటర్ ట్రాక్, ఆ ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ ఇందులో చాలా గొప్పగా ఉంటాయి. ప్రకాష్ రాజ్ గారి పాత్రను అందరూ ఇష్టపడుతారు. నేను, ధృవ ఇద్దరం కేమియో పాత్రల్ని చేశాం. అనూప్ రూబెన్స్ మ్యూజిక్, ఆర్ఆర్ ఈ చిత్రానికి ప్రధాన బలం. నా ఏడీ మూర్తి ఈ మూవీ కోసం ఎంతో కష్టపడ్డాడు. మూర్తి, నేను కలిసే ఈ సినిమాని చేశాం. కెమెరామెన్ బాల కుమారన్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చాడు. సున్నితమైన అంశాలతో తెరకెక్కించినా కూడా అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇది మేం హృదయంతో తెరకెక్కించాం. బంధాల విలువలను చాటి చెప్పే చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా మా సినిమా ఉంటుంది. ఫిబ్రవరి 14న మా మూవీని చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























