స్వయంభు త్రీడీలో చూసినప్పుడు నేనే షాక్ అయ్యాను – నిఖిల్

Nikhil says I Was Stunned After Watching Swayambhu in 3D

నిఖిల్ సిద్ధార్థ ఎపిక్ పీరియడ్ యాక్షన్ సాగా ‘స్వయంభు’తో తన కెరీర్‌లో బిగ్గెస్ట్ చాప్టర్ లోకి అడుగుపెడుతున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో పిక్సెల్ స్టూడియోస్‌ బ్యానర్ పై భువన్, శ్రీకర్ నిర్మించిన భారీ పాన్-వరల్డ్ విజువల్ వండర్ ని ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. లార్జర్ దెన్ లైఫ్, హై-వోల్టేజ్ డ్రామాలో నిఖిల్ ఇంతకు ముందు ఎప్పుడూ చూడని వారియర్ అవతార్ లో కనిపించబోతున్నారు. మేకర్స్ పవర్ ఫుల్ టీజర్‌తో ప్రమోషన్‌లను ప్రారంభించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో నిఖిల్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నేను రెండేళ్లు ఎవరికీ కనిపించలేదు. ఆ సమయంలో కూడా మీడియా వారు ఎంతో సపోర్ట్‌ చేశారు. హ్యాపీ డేస్‌ వచ్చి 19 సంవత్సరాలు అవుతోంది. ఇన్నేళ్ల నా కెరీర్‌లో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. కానీ అందరూ నాకు సపోర్ట్‌ చేశారు. ‘కార్తికేయ 2’ పాన్ ఇండియా విజయం తర్వాత దానికంటే అద్భుతమైన ప్రాజెక్ట్‌తో రావాలని ఇన్ని రోజులు ఆగాను. చాలా శ్రద్ధతో భయంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ చేసిన సినిమా ‘స్వయంభు’. ఈ సినిమా చూసిన తర్వాత నిఖిల్‌ మావాడు అని చెప్పడానికి మీరంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మంచి కథని బెస్ట్ టెక్నీషియన్స్ తో చేశాం. సెంథిల్ గారి ఫ్రేం లో కనిపిస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆయన ఫ్రేమ్ లో నేను కనిపించడం చాలా ఆనందంగా ఉంది. అలాగే రవి గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇంత మంచి టెక్నీషియన్స్ ఇచ్చిన మా మధు గారికి థాంక్యూ.

ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి కారణం భువన్, డైరెక్టర్ భరత్. ఈ టీజర్ కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే. కథలో చాలా మలుపులు ఉన్నాయి. ముందు ముందు వచ్చే కంటెంట్ లో మరింత రివిల్ చేస్తాము. త్రీడీలో చూసినప్పుడు నేనే షాక్ అయ్యాను. ఈ సినిమా 3D లో రాబోతుంది. మీరందరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. మనమంతా ఇంత స్వేచ్ఛగా ఉండడం వెనక ఎంతోమంది త్యాగాలు ఉన్నాయి. అందరూ రాజుల గురించి మాట్లాడతారు కానీ ప్రాణ త్యాగాలు చేసిన వారియర్స్ గురించి మాట్లాడుకోరు. 1000ఏళ్ల క్రితం మన చిత్తూరు రాయలసీమ ప్రాంతంలో కృష్ణ అనే వారియర్ ఉన్నాడు. అతడి కథ ఇది. అల్లరిగా తిరిగే ఓ అండర్ డాగ్.. రాజ్యాలను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు అనేది ఇందులో చూపించాం. ఫిక్షన్ ఎలిమెంట్స్ఉన్నప్పటికీ ఇది నిజంగా జరిగిన కథ. డైరెక్టర్ చాలా రీసెర్చ్ చేసుకొని ఈ కథను తీసుకొచ్చారు. ఇంతలో నేను ఒక అండర్ డాగ్ గా కనిపిస్తాను. ఓ అండర్ డాగ్ ఏం సాధించాడనేది ఈ సినిమాలో బెస్ట్ విజువల్స్, మ్యూజిక్ తో చూస్తారు. అందరికీ థాంక్యు సో మచ్.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.