మాస్ కా దాస్ విశ్వక్ సేన్, దర్శకుడు కె.వి. అనుదీప్ కాంబినేషన్లో వస్తున్న అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైనర్ ‘ఫంకీ’ నుండి సెకండ్ సింగిల్ వచ్చేసింది.ఇంతకుముందు ఈసినిమానుండి వచ్చిన ‘ధీరే ధీరే’ సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ రాగా తాజాగా విడుదలైన రెండో సాంగ్ కూడా సూపర్ అనేలా వుంది. రామ్ మిర్యాల వోకల్స్ఈ సాంగ్ ను రిపీట్ లో వినేలా చేశాయి. భీమ్స్ మంచి ట్యూన్స్ ఇచ్చాడు. దేవ్ పవార్ ఈ సాంగ్ ను రచించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సినిమా రంగంపై ఒక సెటైరికల్ మరియు కామెడీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో విశ్వక్ సేన్ డైరెక్టర్ గా నటించగా తనకు జంటగా కయాదు లోహర్ కనిపించనుంది.ఇప్పటికే విడుదలైన టీజర్ , సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. అనుదీప్ మార్క్ కామెడీతో వస్తున్న ఈసినిమాను నాగవంశీ, సాయి సౌజన్య ఈ క్రేజీ ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నారు.వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 13, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.
ఇక ఈసినిమాతో హిట్ మళ్ళీ ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు విశ్వక్ సేన్. గత ఏడాది విశ్వక్ కు మెకానిక్ రాకీ ,లైలా తో వరుస షాక్ లు తగిలాయి.దాంతో ఈసారి ఎలాగైనా ఫంకీ తో హిట్ కొట్టాలనే పట్టుదలతో వున్నాడు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























