మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్‌లకు ‘పద్మశ్రీ’.. ఘనంగా సన్మానించిన మెగాస్టార్ చిరంజీవి

Megastar Chiranjeevi Felicitate Padma Shri Winners Murali Mohan and Rajendra Prasad

రిపబ్లిక్ డే సందర్భంగా టాలీవుడ్ ఆనందంతో వెలిగింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు ప్రముఖులతో పాటు సీనియర్ నటులు మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్‌లు పద్మశ్రీ అవార్డులకు ఎంపిక కావడం సినీ పరిశ్రమకు విశేష గౌరవంగా నిలిచింది. ఈ ఆనందాన్ని మరింత ప్రత్యేకంగా మార్చారు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి స్వయంగా మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్‌ల నివాసాలకు వెళ్లి వారిని సాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందించి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ ముగ్గురి మధ్య జరిగిన ఆత్మీయ సంభాషణలు, జ్ఞాపకాల పంచుకోవడం.. దశాబ్దాల పాటు కలిసి ప్రయాణించిన అనుబంధాన్ని, పరస్పర గౌరవాన్ని ప్రతిబింబించాయి. 2006లో పద్మభూషణ్, 2024లో పద్మవిభూషణ్ అందుకున్న చిరంజీవి, ఇది చిత్ర పరిశ్రమకు నిజంగా ఒక ఆనందకరమైన రోజు అని అభివర్ణించారు. తెలుగు సినిమాకు లభించిన ఈ జాతీయ గౌరవం ఒక మైలురాయిగా ఆయన పేర్కొన్నారు.

ఇదే సందర్భంలో సోషల్ మీడియా ద్వారా కూడా చిరంజీవి పద్మ అవార్డు పొందినవారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మమ్ముట్టీ, మాధవన్‌తో పాటు క్రీడారంగం నుంచి రోహిత్ శర్మ, వరల్డ్‌కప్ విజేత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, అలాగే డాక్టర్ దత్తాత్రేయుడు నోరి గారికి అభినందనలు తెలియజేశారు. విశిష్ట వ్యక్తులను సత్కరించడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. శ్రీ ధర్మజీ గారి పద్మ విభూషణ్, మై డియర్ మమ్ముట్టీ గారు, డాక్టర్ దత్తాత్రేయుడు నోరి గారికి లభించిన పద్మ భూషణ్.. ఇవన్నీ దశాబ్దాల పాటు వారు చూపిన అంకితభావం, ప్రతిభకు దక్కిన గౌరవం.

మిత్రులు మురళీ మోహన్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, సోదరుడు మాధవన్ గారు, మన చాంపియన్ రోహిత్ శర్మ, అలాగే వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు పద్మశ్రీ లభించడం ఎంతో సంతోషంగా ఉంది. కళలు, విజ్ఞానం, వైద్యం, సాహిత్యం, క్రీడలు వంటి రంగాల్లో విశేష సేవలు అందించిన 2026 సంవత్సరపు పద్మ అవార్డు గ్రహీతలకు నా హృదయపూర్వక అభినందనలు’ తెలియజేశారు.

తెలుగు సినీ పరిశ్రమలో సానుకూల వాతావరణాన్ని పెంపొందించేలా ఇలాంటి ముందడుగులు వేయడం ప్రశంసనీయం. ఎప్పటిలాగే సహచరుల పట్ల ప్రేమని చాటుతూ, ప్రతి సందర్భంలోనూ ఒక ఆత్మీయ పెద్దగా ఇండస్ట్రీకి అండగా నిలుస్తూ చిరంజీవి గారు తన గొప్ప మనసు మరోసారి చాటారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.