మహేష్ బాబు చేతుల మీదుగా విడుదలైన శ్రీనివాస మంగాపురం ఫస్ట్ లుక్ పోస్టర్ 

Mahesh babu Unveils the First Look Poster of Srinivasa Mangapuram

సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరుడు, దివంగత రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ టాలీవుడ్‌లోకి ఘనంగా అడుగుపెడుతున్నారు. ఆయన హీరోగా పరిచయమవుతున్న మొదటి సినిమా ‘శ్రీనివాస మంగాపురం’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నేడుఉదయం 10:30 గంటలకు మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ‘ఆర్‌ఎక్స్ 100’, ‘మంగళవారం’ వంటి విభిన్నమైన మరియు ఇంటెన్స్ చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో జయకృష్ణ  బైక్‌పై దూసుకెళ్తూ, చేతిలో గన్ పట్టుకుని సీరియస్ ఎక్స్‌ప్రెషన్‌తో  ఇంటెన్స్ లుక్ లో కనిపించాడు.ఈ ఫస్ట్ లుక్ సందర్భంగా మహేష్ బాబు మూవీ టీంకు  ఆల్ ది బెస్ట్  చెప్పారు. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాతో బాలీవుడ్ నటి రవీనా టండన్ కుమార్తె రాషా తడానీ తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఇది ఒక ‘టైమ్‌లెస్ కల్ట్ లవ్ స్టోరీ’ అని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఆధ్యాత్మికత మరియు యాక్షన్ కలబోసిన ఈ కథ తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం నేపథ్యంలో సాగనున్నట్లు సమాచారం. అశ్వినీ దత్ సమర్పణలో, పి. కిరణ్ ‘చందమామ కథలు’ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు అద్భుతమైన స్వరాలను అందిస్తున్నారు. ఇప్పటికే 30 శాతానికి పైగా షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం, సంక్రాంతి విరామం తర్వాత తన తదుపరి షెడ్యూల్‌ను ప్రారంభించనుంది.

జయకృష్ణ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా నటన, ఫైట్స్ మరియు డ్యాన్స్‌లో  శిక్షణ తీసుకున్నారు. అజయ్ భూపతి గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాలో కూడా హీరో పాత్ర ఎంతో రా అండ్ రస్టిక్  గా ఉండబోతోందని ఇండస్ట్రీ టాక్. మోహన్ బాబు ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి, అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రం 2026 వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.