
ట్రైలర్ & టీజర్
ట్యాగ్ · 1 కథనాలు


రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది స్పిరిట్ టీం.ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ (యానిమల్, అర్జున్ రెడ్డి ఫేమ్) కాంబినేషన్లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ 'స్పిరిట్' నుంచి మేకర్స్ ఒక ప్రత్యేకమైన ఆడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు. సినిమా షూటింగ్ ఇంకా మొదలుకాకముందే, ఈ 'సౌండ్ స్టోరీ'తో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. సాధారణంగా ఫస్ట్ లుక్ లేదా టీజర్‌ను విడుదల చేసే ట్రెండ్‌కు భిన్నంగా, సందీప్ రెడ్డి వంగ ఒక డిఫరెంట్ అప్డేట్ను ఎంచుకున్నారు.సుమారు 91 సెకన్ల నిడివి ఉన్న ఈ ఆడియో గ్లింప్స్ తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది.