తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన హీరో విష్ణు విశాల్, విష్ణు విశాల్ స్టూడియోస్, శుభ్ర & ఆర్యన్ రమేష్ లతో కలిసి నిర్మించిన ‘ఆర్యన్’ అనే గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌తో వస్తున్నారు. ఈ చిత్రానికి ప్రవీణ్ కె దర్శకత్వం వహించారు. మేకర్స్ ఇటీవల టీజర్ ను విడుదల చేశారు. దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా, ఆర్యన్ చిత్రం అక్టోబర్ 31న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ‘ఐ యామ్ ది గాయ్’ సాంగ్ రిలీజ్ చేశారు. జిబ్రాన్ స్వరపరిచిన ఈ పాటనకు సామ్రాట్ సాహిత్యం అందించారు. జిబ్రాన్, శ్రీకాంత్ హరిహరన్ అద్భుతంగా పాడారు. ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో శ్రేష్ట్ మూవీస్ ద్వారా విడుదల చేయనున్నారు. అనేక బ్లాక్ బస్టర్లను అందించిన ప్రొడక్షన్ , డిస్ట్రిబ్యూషన్ బ్యానర్ మద్దతుతో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. శ్రేష్ట్ మూవీస్ గతంలో విక్రమ్, అమరన్, థగ్ లైఫ్ వంటి చిత్రాలను విడుదల చేశారు.
సెల్వరాఘవన్, శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో విష్ణు విశాల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. సాయి రోనక్, తారక్ పొన్నప్ప, మాల పార్వతి, అవినాష్, అభిషేక్ జోసెఫ్ జార్జ్ సహాయక పాత్రల్లో నటిస్తున్నారు.
విష్ణు విశాల్ FIR చిత్రానికి దర్శకత్వం వహించిన మను ఆనంద్ ఈ చిత్రానికి సహ రచయితగా పనిచేశారు. హరీష్ కన్నన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా, గిబ్రాన్ సంగీతం, శాన్ లోకేష్ ఎడిటర్. ట్రైలర్, ఆడియో లాంచ్‌కు సంబంధించిన అప్డేట్లు త్వరలో అనౌన్స్ చేస్తారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























