రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు వేడుకల సందడిలో, ఫ్యాన్స్‌కి మరో ఆనందం చేరింది. ప్రభాస్ నటించిన క్లాసిక్ రొమాంటిక్ డ్రామా “పౌర్ణమి” మళ్లీ పెద్ద తెరపైకి రానుంది. అక్టోబర్ 23న రీ-రిలీజ్ కానున్న ఈ చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికలపై ట్రెండింగ్‌లో ఉంది. యమ్.ఎస్. రాజు నిర్మాణంలో, కరుణాకరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన “పౌర్ణమి” ఆధ్యాత్మికత, ప్రేమ, త్యాగం కలగలిపిన కథతో ఆ సమయంలో ప్రేక్షకులను కట్టిపడేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రభాస్ ఆకర్షణీయమైన స్క్రీన్ ప్రెజెన్స్, చార్మింగ్ లుక్స్, మరియు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు ప్రత్యేకతను తీసుకొచ్చాయి. ఇప్పుడు, రెబల్ స్టార్ అభిమానులు ఈ చిత్రాన్ని తిరిగి థియేటర్లలో చూసే అవకాశాన్ని సంబరంగా మార్చుకుంటున్నారు. అభిమానులు స్పెషల్ షోలు, కటౌట్లు, ఫ్లెక్సీలు, ఫ్యాన్ ఫెస్ట్‌లను ప్లాన్ చేస్తూ తమ ఐడల్ పుట్టినరోజును మరపురాని ఈవెంట్‌గా మార్చేందుకు సిద్ధమవుతున్నారు.
కాగా, పౌర్ణమి రీ-రిలీజ్ కేవలం ఒక సినిమాకి తిరిగి రావడమే కాదు, ప్రభాస్ కెరీర్‌లోని ఒక అందమైన మైలురాయిని, ఆయన ఫ్యాన్స్‌తో ఉన్న ఎమోషనల్ కనెక్షన్‌ను మళ్లీ గుర్తు చేసే వేడుక. అందుకే, రెబెల్ స్టార్ అభిమానులు ఈ సినిమాను బిగ్ స్క్రీన్ పైన వీక్షించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























