కాంతార చాప్టర్ 1.. 6 డేస్ కలెక్షన్స్  

Impressive 6-Day Collections for Kantara Chapter 1

ఫస్ట్ వీకెండ్ లో రికార్డు  స్థాయిలో వసూళ్లను రాబట్టుకున్న  కాంతార చాప్టర్ 1 వీక్ డేస్ లోకూడా అదే జోరు కొనసాగిస్తుండడం తో  కేవలం  ఆరు రోజుల్లోనే ఈసినిమా 400కోట్ల క్లబ్ లో చేరిపోయింది. నిన్న ఈసినిమా సూపర్ స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగించింది.నిన్న ఒక్క రోజే బుక్ మై షో లో 5 లక్షలుపైగా  టికెట్స్  తెగాయి. ముఖ్యంగా కర్ణాటకలో ఈసినిమా రాంపేజ్ కొనసాగిస్తుంది. నిన్నటి తో అక్కడ 100కోట్ల మార్క్ ను చేరుకుంది. దాంతో  అతి తక్కువ రోజుల్లో ఈ ఫీట్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. మలయాళం లోకూడా  సాలిడ్ వసూళ్లతో సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుంది. నిన్నటి తో కేరళలో  28కోట్ల  గ్రాస్ వసూళ్లను  రాబట్టుకుంది. తమిళంలోకూడా  హిట్ దిశగా దూసుకుపోతుంది. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక  హిందీలో కూడా నిన్నటితో  100కోట్ల క్లబ్ లో చేరగా  తెలుగు రాష్ట్రాల్లో  ఈసినిమా  సూపర్ రన్ ను కొనసాగిస్తోంది. ఓవరాల్ గా  ఈసినిమా 6రోజుల్లో 427. 5 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుందని మేకర్స్ ప్రకటించారు.ఈ వారంలో 500కోట్ల  క్లబ్ లో చేరనుంది. అయితే బ్రేక్  ఈవెన్ టార్గెట్ కూడా ఎక్కువగా  ఉండడంతో  రానున్న రోజుల్లో ఇదే జోరును కొనసాగించాల్సి ఉంటుంది. 

 బ్లాక్  బస్టర్ కాంతార కు  ప్రీక్వెల్ గా రిషబ్ శెట్టి హీరోగా నటించి డైరెక్ట్ చేసిన ఈసినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించాడు.భారీ బడ్జెట్ తో హోమ్ బలే ఫిలిమ్స్ నిర్మించింది. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.