థామా ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్ చేస్తుంది – రష్మిక మందన్న

Rashmika Mandanna Promises, Thamma Will Definitely Surprise The Audience

నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయికగా నటించిన తాజా హిందీ చిత్రం ‘థామా’. హారర్‌ కామెడీగా రూపొందిన ఈ సినిమాకి ఆదిత్యా సర్పోత్దార్‌ దర్శకత్వం వహించగా, బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్‌ ఖురానా కథానాయకుడిగా నటించాడు. పరేష్ రావల్, నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రలు పోషించారు. మాడాక్ ఫిల్మ్స్ సమర్పణలో దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు. ఈ మూవీ అక్టోబరు 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా హీరోయిన్ రష్మిక మందన్న మాట్లాడుతూ.. “మాడాక్ హారర్ కామెడీ ఫిలిమ్స్ లో చాలా మంచి కాన్సెప్ట్ ఉంటుంది. కథకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. పర్ఫార్మెన్సెస్ అమేజింగ్‌గా ఉంటాయి. ఈ యూనివర్స్‌కి ఆడియన్స్ నుంచి చాలా మంచి ఆదరణ ఉంది. అలాంటి సినిమా చేస్తున్నప్పుడు కచ్చితంగా మనపై రెస్పాన్సిబిలిటీ ఉంటుంది.” అని తెలిపారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ.. “ఈ అవకాశం ఇచ్చిన మాడాక్ ఫిలింస్ కి థాంక్యూ. తప్పకుండా ఈ సినిమా వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ఉంటుంది. ప్రతి సినిమాకి ఒక కొత్త క్యారెక్టర్ చేయాలని ప్రయత్నిస్తుంటాను. ఈ సినిమాతో కూడా ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్ చేస్తానని భావిస్తున్నాను. ఈ సినిమా 21 అక్టోబర్ రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్స్ లో చూసి మీ బ్లెస్సింగ్స్ అందిస్తారని కోరుకుంటున్నాను.” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.