తమిళ హీరో శివకార్తికేయన్ -డైరెక్టర్ సుధా కొంగర కాంబినేషన్ లో వస్తున్న సినిమా పరాశక్తి.శివ కార్తికేయన్ కు ఇది 25వ సినిమా.ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది.ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.పొంగల్ కానుకగా జనవరి 14న తమిళ్ తోపాటు తెలుగు ,కన్నడ ,మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే అదే టైంలో జన నాయగన్ విడుదలకానుండడంతో ఈరెండు సినిమాల మధ్య ఇంట్రస్టింగ్ క్లాష్ జరుగనుంది.ఇక తెలుగులో మాత్రం ఈరెండు సినిమాలకు భారీ పోటీ ఎదురుకానుంది.సంక్రాంతి టైంలో తెలుగు నుండి 4 పెద్ద సినిమాలు వస్తున్నాయి.మరి జన నాయగన్ ,పరాశక్తి ఈ పోటీని తట్టుకొని ఎంతవరకు నిలబడతాయో చూడాలి.
పరాశక్తిలో అథర్వ ,శ్రీలీల కీలకపాత్రల్లో నటిస్తుండగా రవి మోహన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.జివి ప్రకాష్ కుమార్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్నారు.ఇక రీసెంట్ గా శివకార్తికేయన్ ,మదరాసి రాగ ఈసినిమా అనుకున్న స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోతుంది.మొదటి వారంలో 80 కోట్ల గ్రాస్ తో సరిపెట్టుకుంది.మురగదాస్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా అనిరుధ్ సంగీతం అందించాడు.ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























