బ్యాక్ టు బ్యాక్ రెండు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టి ఫుల్ ఫామ్ లో వున్న కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ హ్యాట్రిక్ కొట్టాడనికి రెడీ అవుతున్నాడు.అందులో భాగంగా నెక్స్ట్ ఈ హీరో ఎల్ఐకె (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ)తో రానున్నాడు.సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతుంది. నిన్న ఈసినిమా నుండి ఫస్ట్ పంచ్ పేరుతో టీజర్ ను రిలీజ్ చేశారు.ఇక ఈ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది.టీజర్ లో రోబో ఉండడం అలాగే తలైవర్ 189 ,ఐపీఎల్ 2040,యష్ మిషన్ ఇంపాజిబుల్ 14 ఇలాంటి పోస్టర్లు కనబడ్డాయి. సో సినిమా టైం ట్రావెలర్ కాన్సెప్ట్ తో వస్తున్నట్లు అనిపిస్తుంది. విజువల్స్ అయితే చాలా క్వాలిటీ గా వున్నాయి.టీజర్ చూస్తుంటే డిఫ్రెంట్ స్టోరీ తో ప్రదీప్ రంగనాథన్ మరోసారి మ్యాజిక్ చేసేలా వున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎల్ఐకె ను విగ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తుండగా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఎస్ జె సూర్య విలన్ పాత్రలో కనిపించనున్నాడు.అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.సెవెన్ స్క్రీన్ స్టూడియో నిర్మిస్తున్న ఈసినిమా అక్టోబర్ 17న రిలీజ్ కానుంది.
ఇక ఈసినిమాతోపాటు ప్రదీప్ రంగనాథన్ ప్రస్తుతం డ్యూడ్ అనే సినిమా కూడా చేస్తున్నాడు.కొత్త దర్శకుడు కీర్తిశ్వరన్ డైరెక్ట్ చేస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.కోలీవుడ్ లో మైత్రికి ఇది రెండో సినిమా.యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో ప్రేమలు ఫేమ్ మమితా బైజు హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను కూడా దీపావళికే రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు.దాంతో కొంత గందరగోళం నెలకొంది.మరి ఇందులో ఏదైనా వెనక్కి తగ్గుతుందో లేదో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























