మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ – స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన రెండో సినిమా దేవర.అంతకుముందు వీరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ అనిపించుకోవడంతో దేవరపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.ఇక గత ఏడాది విడుదలైన ఈసినిమా 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సెన్సేషనల్ హిట్ అనిపించుకుంది. ఇక ఈసినిమాకు సీక్వెల్ కూడా రానుందని తెలిసిందే.
అయితే వార్ 2 రిలీజ్ అయ్యాక కొద్దీ రోజుల నుండి దేవర 2 షెల్వ్ చేశారని ప్రచారం జరిగింది.అంతకుముందు కూడా ఈ సీక్వెల్ విషయంలో ఇలాంటి వార్తలే రాగ స్వయంగా ఎన్టీఆరే ఓ స్టేజ్ మీద దేవర 2 పక్కా ఉంటుంది అని క్లారిటీ ఇచ్చాడు. అయినా కూడా ఇప్పుడు మరోసారి దేవర 2 క్యాన్సల్ అనే వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు రూమర్స్ మాత్రమేనని అందులో ఎలాంటి నిజం లేదని సమాచారం.ఎన్టీఆర్ ఈ సీక్వెల్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట .
ఇక కొరటాల శివ, దేవర 2 కంటే ముందు నాగ చైతన్య తో ఓ సినిమా చేయనున్నాడని కూడా వార్తలు వచ్చాయి.ఇది కూడా ఫేక్ న్యూసే. ప్రస్తుతం కొరటాల ఫోకస్ అంతా దేవర 2 పైనే పెట్టాడు.వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈసినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి.రవి బసృర్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ,ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి.ఈసినిమాను పూర్తి చేసి ఎన్టీఆర్ , దేవర 2 ను స్టార్ట్ చేయనున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























